ఆ క్రేజీ కాంబినేషన్ లేనట్టే..!

13 Sep, 2017 15:26 IST|Sakshi
ఆ క్రేజీ కాంబినేషన్ లేనట్టే..!

కొద్ది రోజులుగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, మాస్ హీరో అజిత్ తో ఓ సినిమా చేయబోతున్నాడన్న వార్త సౌత్ సినీ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం రోబో సీక్వల్ 2.ఓతో బిజీగా ఉన్న శంకర్, తన నెక్ట్స్ సినిమా అజిత్ హీరోగా తెరకెక్కించబోతున్నాడని.. ఇప్పటికే ఈ మేరకు చర్చలు మొదలయ్యాయని ప్రచారం జరిగింది. అభిమానులు కూడా ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తే పాత రికార్డ్ లన్ని తిరగరాయటం కాయం అని ఫిక్స్ అయ్యారు.

అయితే అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లుతూ అలాంటి ప్రాజెక్ట్ ఏది చర్చల్లో లేదని ప్రకటించారు శంకర్ టీం. ప్రస్తుతం రోబో సీక్వల్ పనుల్లోనే బిజీగా ఉన్న శంకర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎవరితోనూ చర్చించలేదని తెలిపారు. అజిత్ కూడా వివేగం సినిమా తరువాత సర్జరీ చేయించుకొని ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా లేనట్టే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్.