డోన్ట్‌ వర్రీ!

28 Feb, 2018 00:29 IST|Sakshi
రవితేజ

.... హీరో రవితేజకు సెట్‌లో ఎటువంటి ప్రమాదం జరగలేదు అని అభిమానులకు భరోసా ఇచ్చారు దర్శకుడు కల్యాణ్‌కృష్ణ. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్ళూరి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ స్పాట్‌లో బైక్‌ చేజింగ్‌ స్టంట్‌ చేసిన రవితేజ ప్రమాదవశాత్తు గాయపడ్డారని, రెండు నుంచి మూడు వారాల సమయం పాటు  విశ్రాంతి తీసుకోమని ఆయనకు డాక్టర్లు సూచించారని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి.

ఈ వార్తల్లో నిజం లేదని దర్శకుడు కల్యాణ్‌కృష్ణ పేర్కొన్నారు. ‘‘రవితేజగారికి ఏమైంది? ఆయన గురించి చాలా వార్తలు వస్తున్నాయి?’’ అని ఓ అభిమాని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ఏమీ జరగలేదు. ఆ వార్తల్లో నిజం లేదు. డోన్ట్‌ వర్రీ. ఆయన పర్ఫెక్ట్‌’’ అని ఆ అభిమాని పోస్ట్‌కు స్పందించారు కల్యాణ్‌ కృష్ణ. ఇందులో మాళవిక వర్మ కథానాయిక. ఈ సినిమాకు ‘నేల టిక్కెట్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.   

మరిన్ని వార్తలు