ప్రయాణం ఆరంభం

27 Jan, 2020 07:01 IST|Sakshi
సుభాణి, మధు, శ్రీకాంత్‌

పృథ్వీశేఖర్‌ హీరోగా రమేష్‌ రాణా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘క్లూ’. ‘జర్నీ బిగిన్స్‌’ అనేది ఈ సినిమా ఉప శీర్షిక. యాక్షన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్,  ఎస్‌ అండ్‌ ఎమ్‌ క్రియేషన్స్‌ పతాకాలపై సుభాణి అబ్దుల్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘ఇందులో పృథ్వీశేఖర్‌ రిస్కీ ఫైట్స్‌ చేశారు. రమేష్‌ రాణా కమర్షియల్‌ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకుంటారు. నిర్మాణ విలువల విషయంలో రాజీ పడకుండా సినిమాలు చేసే సుభాణి వంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం ఉంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ర్యాప్‌ రాక్‌ షకీల్‌ మంచి సంగీతం ఇచ్చారు. పాటలు యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి’’ అన్నారు. ‘‘మా చిత్రం టైటిల్, ఫస్ట్‌ లుక్‌ లోగోను విడుదల చేసిన శ్రీకాంత్‌గారికి ధన్యవాదాలు. ఈ 2020లో మరో మూడు చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాం’’ అన్నారు సుభాణి అబ్దుల్‌.

మరిన్ని వార్తలు