చాలా గర్వంగా ఉంది

30 Jun, 2018 00:46 IST|Sakshi
నాజర్‌

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉద్యమ సింహం’. కేసీఆర్‌ పాత్రలో నటుడు నాజర్‌ నటిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర్‌రావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నాజర్‌ మాట్లాడుతూ ‘‘నేను ఇప్పటి వరకు 500 సినిమాల్లో నటించాను. కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసి.. గెలిచిన కేసీఆర్‌గారి పాత్రలో నటించడం చాలా ఎమోషనల్‌గా ఫీలవుతున్నా. ఈ పాత్ర చేయడం చాలా గర్వంగా, గౌరవంగా ఉంది.

కేసీఆర్‌గారి వీడియోలు చాలా చూశా. ఆయనకు సంబంధించిన పుస్తకాలు చదువుతున్నా’’ అన్నారు. ‘‘కేసీఆర్‌గారు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం నుంచి బంగారు తెలంగాణ వరకు ఈ సినిమా ఉంటుంది. నవంబర్‌ 29న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత కల్వకుంట్ల నాగేశ్వర్‌రావు. ‘‘కేసీఆర్‌గారి పాత్ర కోసం చాలామందిని అనుకున్నాం. నాజర్‌గారైతే పర్‌ఫెక్ట్‌గా ఉంటుందని ఆయన్ని తీసుకున్నాం’’ అన్నారు కృష్ణంరాజు. ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్‌ కుమార్, సంగీతం: వరికుప్పల యాదగిరి, సహ నిర్మాత: మేకా రాఘవేంద్ర.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు

సినిమా

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు

మరో సింగర్‌కు కరోనా పాజిటివ్‌!