మేం విడిపోవడానికి  శ్రుతీహాసన్‌ కారణం కాదు

28 Feb, 2018 00:21 IST|Sakshi
శ్రుతీహాసన్‌,గౌతమి

కమల్‌హాసన్‌–శ్రీదేవి బ్రేక్‌ కే బాద్‌ మళ్లీ కలిశారా? కమల్‌ పొలిటికల్‌ లైఫ్‌లో గౌతమికి స్థానం ఉందా? కమల్‌ ఆరంభించిన పొలిటికల్‌ పార్టీ ‘మక్కళ్‌ నీది మయమ్‌’కి గౌతమి సపోర్ట్‌ చేయబోతున్నారా? అటు చెన్నై ఇటు హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఒకటే చర్చ. ఈ చర్చకు గౌతమి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. కమల్‌తో ఇప్పుడు తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారామె. సోషల్‌ మీడియా ద్వారా గౌతమి తన మనోభావాలను పంచుకున్నారు. ‘‘పాస్ట్‌ ఈజ్‌ పాస్ట్‌ అండ్‌ దేర్‌ ఆర్‌ రీజన్స్‌ ఫర్‌ ఇట్‌’’ అంటూ ఈ నెల 24న ఓ లెటర్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారామె. ‘‘ఎవరి గురించైనా నేను ఏదైనా చెబుతున్నానంటే తప్పకుండా ఓ కారణం ఉంటుంది. 30 ఏళ్లుగా నన్ను తెలిసినవారికి నేనేంటో బాగా తెలుసు’’  అంటూ ‘ప్రూఫ్‌ అండ్‌ జడ్జ్‌మెంట్స్‌’ అంటూ మరో లెటర్‌ను మంగళవారం పోస్ట్‌ చేశారు గౌతమి.  ఈ రెండు ఉత్తరాల ద్వారా ఆమె తన జీవితంలోని కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. వాటిలో కొన్ని సంగతులు..

మిస్టర్‌ కమల్‌హాసన్‌కు నా సపోర్ట్‌ లభిస్తుందన్న వార్తల్లో  నిజం లేదు. ఆల్మోస్ట్‌ మా 13ఏళ్ల రిలేషన్‌షిప్‌కు 2016లో ఫుల్‌స్టాప్‌ పడింది. ప్రస్తుతం పర్శనల్‌గా కానీ ప్రొఫెషనల్‌గా కానీ మరే విధంగా కానీ మిస్టర్‌ కమల్‌హాసన్‌తో నాకు ఎటువంటి సంబంధాలు లేవు. ప్రస్తుతం నా కూతురి (సుబ్బలక్ష్మి)  భవిష్య , ఆర్థిక వనరులపైనే దృష్టిపెట్టాను

మిస్టర్‌ కమల్‌హాసన్‌తో నా రిలేషన్‌షిప్‌ బ్రేక్‌ అవ్వడానికి మూడో వ్యక్తి ఎవరూ కారణం కాదు. మా బంధం చెడిపోవడానికి శ్రుతీహాసన్‌ కారణం అని చాలామంది చెప్పుకుంటున్నారని విన్నాను. అదేం లేదు. మేం విడిపోవడానికి పిల్లలెవరూ కారణం కాదు. శ్రుతి, అక్షరలను నేనిప్పటికీ పిల్లలుగానే చూస్తాను. అయినా.. ఇద్దరు పెద్దవాళ్లు ఒక రిలేషన్‌షిప్‌ నుంచి విడిపోవడానికి పిల్లలు కారణం కారనే నేను నమ్ముతాను. మిస్టర్‌ కమల్‌హాసన్‌ కొన్ని కొత్త కమిట్‌మెంట్స్‌ తీసుకున్నారు. అవి నా ఆలోచనలకు సరిపడలేదు. పైగా నా ఆత్మగౌరవం దెబ్బతింటుందన్న భావన కలిగింది. ఆత్మాభిమానాన్ని వదులుకోదలచుకోలేదు. మా రిలేషన్‌ చెడిపోవడానికి ఇదొక్కటే కారణం.

రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ (కమల్‌హాసన్‌ సొంత నిర్మాణ సంస్థ) నిర్మించిన సినిమాలకు, మిస్టర్‌ కమల్‌హాసన్‌ బయట సంస్థల్లో నటించిన సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వర్క్‌ చేశాను. అప్పట్లో నా ఇన్‌కమ్‌ సోర్స్‌లో మేజర్‌ ఇదే. అయితే ‘దశావతారం, విశ్వరూపం’.. మరికొన్ని సినిమాలకు సంబంధించిన కొంత పారితోషికం ఇంకా రావాల్సి ఉంది.

ప్రస్తుతం నా దృష్టంతా నేను నిర్వహిస్తున్న ‘లైఫ్‌ ఎగైన్‌ ఫౌండేషన్‌’, నా కూతురు భవిష్యత్‌ మీదే. నన్ను సపోర్ట్‌ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. 

>
మరిన్ని వార్తలు