ప్రతి తండ్రి కనెక్ట్‌ అవుతాడు

23 Feb, 2020 02:51 IST|Sakshi
రాహుల్, ప్రియ

‘‘కాలేజ్‌కుమార్‌’ సినిమాలో మంచి ఫీల్, ఎమోషన్స్‌ ఉన్నాయి. ఈ సినిమాకు ప్రతి తండ్రి కనెక్ట్‌ అవుతాడు. ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ కుమారుడు రాహుల్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడని తెలిసి హ్యాపీ ఫీలయ్యాను. ఇందులో నేను ఓ పాత్ర చేయాల్సింది. కుదర్లేదు. ఆ పాత్రను నా తమ్ముడు రవి చేశాడు’’ అన్నారు నటుడు సాయికుమార్‌. రాహుల్‌విజయ్, ప్రియా వడ్లమాని జంటగా సీనియర్‌ నటులు రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కాలేజ్‌కుమార్‌’. కన్నడ హిట్‌ ‘కాలేజ్‌కుమార్‌’కు ఇది రీమేక్‌.

మాతృకకు దర్శకత్వం వహించిన హరి సంతోష్‌నే తెలుగు రీమేక్‌కూ దర్శకత్వం వహించారు. లక్ష్మణ గౌడ సమర్పణలో ఎల్‌. పద్మనాభ నిర్మించిన ఈ చిత్రం మార్చి 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘నటుడిగా రాహుల్‌ ప్రతిభ చూపించాడు. ఇందులో రాహుల్‌ తండ్రి పాత్రలో నటించాను. మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమాను కూడా సక్సెస్‌ చేయాలి’’ అన్నారు. ‘‘మంచి కుటుంబ కథాచిత్రం ఇది.

రాజేంద్రప్రసాద్‌గారితో కలిసి నటించడం çహ్యాపీగా ఉంది. డైరెక్టర్‌ ఒక మంచి సబ్జెక్ట్‌తో తీశారు. మా సినిమాను సపోర్ట్‌ చేస్తున్న సురేష్‌ ప్రొడక్షన్స్‌వారికి ధన్యవాదాలు’’ అన్నారు రాహుల్‌. ‘‘ఫైట్‌ మాస్టర్‌గా నన్ను ఆదరించారు. ఇప్పుడు హీరోగా మా అబ్బాయికి మీ (ప్రేక్షకులు) అందరి సపోర్ట్‌ కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు విజయ్‌. ‘‘అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు హరి. ‘‘నాకు అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధ్యాంక్స్‌’’ అన్నారు ప్రియా వడ్లమాని.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు