పెళ్లి సందడి!

2 May, 2015 00:14 IST|Sakshi
పెళ్లి సందడి!

 ‘కలర్స్’ స్వాతి పెళ్లి అయిపోయింది. అదేంటి అంత హఠాత్తుగా అనుకుంటున్నారా...! జస్ట్ సినిమా కోసమేనండి! స్వాతి కథానాయికగా జె. రామాంజనేయలు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ.చినబాబు, ఎం రాజశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘త్రిపుర’. ‘గీతాంజలి’ ఫేం రాజ్‌కిరణ్ దర్శకుడు. కథ కూడా ఆయన రాసుకున్నదే.
 
 కథానాయిక స్వాతిపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. దీంతో 40 శాతం టాకీ పార్టు పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ఇప్పటివరకూ చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి ’’ అని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, కెమెరా: రవికుమార్ సానా, సమర్పణ: జె.రామాంజనేయిలు.