కోమాలి దర్శకుడితో విక్రమ్‌

27 Sep, 2019 10:14 IST|Sakshi

నటుడు విక్రమ్‌ మరో చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. దక్షిణాదిలో విలక్షణ నటుడిగా పేరు పొందిన నటుడు విక్రమ్‌. పాత్ర కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధపడతారు. ప్రయోగాలు చేయడానికి ముందే విక్రమ్‌ అలా ఇటీవల నటించిన కడారం కొండాన్‌ చిత్రం నిరాశనే మిగిల్చింది. దీంతో తన కొత్త చిత్రాల విషయంలో విక్రమ్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహించనున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధం అవుతున్నారు.

అంతకు ముందు ఇమైకా నొడిగళ్‌ చిత్రం ఫేం అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటించనున్నట్లు ఇటీవల తెలిపారు. కాగా తాజాగా అంత కంటే ముందు యువ దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. జయం రవి హీరోగా రంగనాథన్‌ తెరకెక్కించిన కోమాలి చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో చిత్ర నిర్మాత ఐసరి గణేశ్‌ దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌కు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు.

అంతే కాదు తన సంస్థలో తదుపరి చిత్రానికి ఆయన్నే దర్శకుడిగా ఎంచుకున్నారు. ఈ చిత్రంలోనే నటుడు విక్రమ్‌ హీరోగా నటించనున్నారనేది తాజా సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా విక్రమ్‌ ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాల్లో కర్ణన్‌ అనే పౌరాణిక ఇతిహాస కథా చిత్రం ఉంది. ఇది తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ ఎత్తున రూపొందనుంది. ప్రదీప్‌ రంగనాథన్, అజయ్‌ జ్ఞానముత్తు, మణిరత్నం చిత్రాలను పూర్తి చేసిన తరువాత కర్ణన్‌ చిత్రంలో నటించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్క సినిమా సీఎం.. ఎన్టీఆర్‌కు నచ్చిన బ్యాంకు ఉద్యోగి

స్టార్‌ హీరోపై కన్నేసిన రష్మిక

వేణుమాధవ్‌కు కన్నీటి వీడ్కోలు

టీజర్‌ చూసి థ్రిల్‌ అయ్యాను

వైజాగ్‌ టు హైదరాబాద్‌

హ్యాపీ.. హ్యాపీ

శ్రీదేవి ఒక యాక్టింగ్‌ స్కూల్‌

తీవ్రవాదం నేపథ్యంలో...

స్కూల్‌ టీచర్‌కి ప్రభాస్‌ ప్రేమ పాఠాలు!

గోపీచంద్‌ కెరీర్‌లో గేమ్‌ చేంజర్‌ మూవీ

నవ్వుల టపాసులు

అలీ రీఎంట్రీ.. ఆనందంలో శివజ్యోతి, శ్రీముఖి

వైరల్‌ : విజయ్‌ దేవరకొండ న్యూ లుక్‌

ముగిసిన వేణుమాధవ్‌ అంత్యక్రియలు

థాయిలాండ్‌ నుంచి ‘వ్యూహం’ కదిలింది!

‘చావుకు తెగించినోడు.. బుల్లెట్టుకు భయపడడు’

బాబాకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన శ్రీముఖి 

'పుత్రోత్సాహంలో ప్రముఖ హీరో'

అనారోగ్యంతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌

అలీరెజా వస్తే.. బిగ్‌బాస్‌ చూడం!

ఆ విషయం వాడినే అడగండి: ప్రియాంక

అక్టోబర్ 18న ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’

‘సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటాం’

వేణు మాధవ్‌ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు

బిగ్‌బాస్‌: అదిరిపోయే ట్విస్ట్‌.. అలీ రీఎంట్రీ!

కమల్‌ హాసన్‌పై నిర్మాత కంప్లయింట్‌

టీజర్‌ చూసి థ్రిల్‌ ఫీలయ్యాను : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

బిగ్‌బాస్‌: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!

సైరా : మరో ట్రైలర్‌

ఎవరేమనుకుంటే నాకేంటి!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కోమాలి దర్శకుడితో విక్రమ్‌

ఒక్క సినిమా సీఎం.. ఎన్టీఆర్‌కు నచ్చిన బ్యాంకు ఉద్యోగి

స్టార్‌ హీరోపై కన్నేసిన రష్మిక

హ్యాపీ.. హ్యాపీ

స్కూల్‌ టీచర్‌కి ప్రభాస్‌ ప్రేమ పాఠాలు!

వేణుమాధవ్‌కు కన్నీటి వీడ్కోలు