ప్రేయ‌సిని పెళ్లాడిన‌ క‌మెడియ‌న్‌

25 Jun, 2020 16:47 IST|Sakshi

చెన్నై: త‌మిళ‌ క‌మెడియ‌న్ అశ్విన్ రాజా త‌న ప్రేయసి విద్య శ్రీని పెళ్లాడాడు. బుధ‌వారం చెన్నైలో వీరి వివాహం సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో నిరాడంబ‌రంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు ఇరు కుటుంబాలతో పాటు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. "చూడ‌ముచ్చ‌టైన జంట" అంటూ అభిమానులు అత‌డికి పెళ్లి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. కాగా గత నాలుగేళ్లుగా విద్య శ్రీ, అశ్విన్‌ ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. (24న ప్రముఖ హాస్య నటుడి వివాహం)

వీరి ప్రేమ‌కు పెద్ద‌లు అంగీకారం తెల‌ప‌డంతో ఇటీవ‌లే నిశ్చితార్థం కూడా జ‌రిగింది. చెన్నైకు చెందిన రాజశేఖర్ కుమార్తె విద్య శ్రీ. ఆమె అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇక వి.స్వామినాథ‌న్ కుమారుడైన అశ్విన్ 'బాస్ ఎంగిరా భాస్క‌ర‌న్' చిత్రంతో కోలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ తర్వాత న‌టించిన‌ ‘కుంకి’ సినిమా అత‌నికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా నుంచి ఆయ‌న అభిమానులు అశ్విన్‌ను ప్రేమ‌గా "కుంకి అశ్విన్" అని పిలుచుకుంటున్నారు. (కూరగాయలు అమ్ముతున్న కమెడియన్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా