సూసైడ్‌కు ముందు విజయ్ సెల్ఫీ వీడియో!

11 Dec, 2017 14:45 IST|Sakshi

సాక్షి, సినిమా : నటుడు విజయ్‌ సాయి ఆత్మహత్య చేసుకోవడం టాలీవుడ్ సర్కిల్‌లో కలకలం రేపింది. విజయ్ ఆత్మహత్యపై ‘బజర్ధస్త్’ కమెడియన్ రాకేష్ విచారం వ్యక్తం చేశారు. ‘ప్రతి చిన్న విషయాన్ని సెన్సిటీవ్ గా తీసుకునే వ్యక్తి విజయ్. మా గ్రూపులో సమస్య ఏదైనా షేర్ చేసుకుంటే మేం సాయం చేసేవాళ్లం. ఇలా జరిగి ఉండేది కాదు. నిన్న (ఆదివారం) రాత్రి ఈ విషాదం జరిగిందంటున్నారు. విషయం తెలియగానే ఉదయం మేం వచ్చి చూశాం.

సెల్ఫీ సూసైడ్ వీడియో కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. పోలీసులు ఈ కోణంలో విచారణ చేపట్టారు. ఒంటరి వాడినయ్యాడని తరచూ స్నేహితులతో అనేవాడు. కష్టాలు దిగమింగుకుని సినిమాల్లో నటించేవాడు. ఎక్కువగా బాధ కలిగితే వారం రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండేవాడు. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని’ నటుడు రాకేష్ అభిప్రాయపడ్డారు.

కాగా, నగరంలోని యూసఫ్‌గూడలో అపార్ట్‌మెంట్‌లో విజయ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు, బొమ్మరిల్లు, సోగ్గాడు, భగీరథ, డిస్కో తదితర చిత్రాల్లో ఆయన నటించారు. సినిమాల్లో అవకాశాల్లేక ఇలా చేసుకున్నాడని కొందరు అంటుండగా, భార్యతో విభేదాల కారణంగానే బలవన్మరణం చెందాడంటూ వదంతులు వినిపిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు