'కలర్‌ ఫోటో'తో విలన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సునీల్

29 Dec, 2019 15:48 IST|Sakshi

హాస్య నటుడిగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సునీల్ ఆ మధ్య హీరోగా మారారు. ఇటీవలి ​కాలంలో మరి కొంచెం ఎక్కువగా.. కమెడియన్లు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం తరుచూ కనిపిస్తోంది. సునీల్‌ విషయానికొస్తే.. హీరోగా మంచి విజయాల్ని అందుకున్నా తర్వాతి కాలంలో సినిమాలు అనుకున్న రీతిలో విజయవంతం కాకపోవడంతో మళ్లీ హాస్య నటుడిగా మారి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన ఈసారి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్ళు హాస్యనటుడిగా, కథానాయకుడిగా అలరించిన ఆయన ఇప్పుడు విలన్‌గా కొత్త అవతారం ఎత్తనున్నారు.
చదవండి: 'ఆయనకు ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వండి'

చదవండి: (సిద్ధార్థ్ రాజకీయ ఎంట్రీపై సస్పెన్ష్‌ వీడినట్టే..!)

విజేత, పేపర్‌ బాయ్‌, మజిలీ, డియర్‌ కామ్రేడ్‌, ప్రతిరోజూ పండగే సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న కమెడియన్‌ సుహాస్‌ హీరోగా, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో 'కలర్ ఫోటో' అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో దర్శకుడిగా సందీప్ రాజ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ప్రేమకథలో సునీల్ విలన్ పాత్రలో కనిపిస్తారని చిత్ర యూనిట్ ప్రకటించింది. కొబ్బరిమట్ట నిర్మించిన సాయి రాజేష్ నీలం, బెన్ని ముప్పానేని నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితమే నాని తన సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేశారు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీత దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు