జూన్‌ 24న ప్రముఖ హాస్య నటుడి వివాహం

20 Jun, 2020 17:08 IST|Sakshi

చెన్నై: ప్రముఖ తమిళ హాస్య నటుడు అశ్విన్‌ రాజా(కుంకి అశ్విన్) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జూన్‌ 24న చెన్నైలో తన ప్రేయసి విద్యాశ్రీని పెళ్లాడబోతున్నాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక జరగనుంది. కాగా గత నాలుగేళ్లుగా విద్యాశ్రీ, అశ్విన్‌ ప్రేమించుకుంటుండగా, ప్రస్తుతం మూడు ముళ్ల బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. (ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగార్జున)

చెన్నైకు చెందిన రాజశేఖర్ కుమార్తె విద్యాశ్రీ. ఈమె అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్‌ పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ కేవలం 20 మంది మాత్రమే పెళ్లికి హాజరు కానున్నట్లు సమాచారం. ఇక అశ్విన్..‌ లక్ష్మీ మూవీ మేకర్స్ నిర్మాతాల్లో ఒకరైన వి. స్వామినాథన్ కుమారుడు. హీరో ఆర్య నటించిన ‘బాస్‌ ఎంగిరా బాస్కరన్‌’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత దర్శకుడు ప్రభు సోలమన్‌ ‘కుంకి’ సినిమాలో నటించి మంచి పేరును సంపాదించారు. అప్పటి నుంచి తమిళ అభిమానులు అశ్విన్‌ రాజాను ప్రేమతో అశ్విన్‌ కుంకీ అని పిలుచుకుంటారు. (ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఔషధమే)

మరిన్ని వార్తలు