కామిక్ అవతార్

11 Oct, 2015 00:13 IST|Sakshi
కామిక్ అవతార్

 స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్... ఇలా  హాలీవుడ్ సూపర్‌హీరో సినిమాలన్నీ కామిక్స్ నుంచి పుట్టినవే. తొలిసారిగా ఓ వెండితెర హీరో  కామిక్ బుక్‌లో సూపర్‌హీరోగా  అలరించనున్నారు. జేమ్స్ కామెరూన్ తీసిన ‘అవతార్’...  ప్రపంచ సినిమా చరిత్రలోనే ఓ  అద్భుతం. ఆరేళ్ల క్రితం  ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.
 
  పండోరా అనే గ్రహాన్ని తన అద్భుతమైన గ్రాఫిక్స్ మాయాజాలంతో తెర మీద ఆవిష్కరించిన జేమ్స్ కామెరూన్  ప్రస్తుతం ఈ  చిత్రానికి సంబంధించిన మూడు సీక్వెల్స్ ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ‘అవతార్’ని కామిక్  బుక్‌లో హీరోగా పరిచయం చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ‘‘డార్క్ హౌస్ కామిక్స్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. మరి కొన్ని కొత్త కథలతో, పండోరా గ్రహంలోని  మరికొన్ని  కొత్త కోణాలను  పదేళ్ల పాటు పుస్తక రూపంలో తీసుకురానున్నాం’’ అని చెప్పారు.
 

>