రామ్ చ‌ర‌ణ్‌ని బీట్ చేసిన అల్లు అర్జున్‌

16 Feb, 2018 16:36 IST|Sakshi
అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్

సాక్షి, సినిమా : మెగా హీరోలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నెలలో వ‌రుణ్ తేజ్‌ ‘తొలిప్రేమ’ , సాయి ధ‌ర‌మ్ తేజ్‌ ‘ఇంటిలిజెంట్‌’,  సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మరి కొద్ది రోజుల్లొ రామ్ చ‌ర‌ణ్ ‘రంగస్థలం’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’  సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాల‌ కోసం మెగా అభిమానులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తు‍న్నారు.  

రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతున్న  ‘రంగస్థలం’ కు మంచి స్పందన లభిస్తోందని తాజాగా విడుద‌లైన టీజర్స్‌ని బ‌ట్టి తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్‌ హీరోగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘నా పేరు సూర్య’  కూడా అభిమానుల‌ని అల‌రించేలా రూపొందుతున్నట్లు ఇటీవ‌ల విడుద‌లైన ఇంపాక్ట్ టీజ‌ర్‌ని బ‌ట్టి తెలుస్తోంది. 

అయితే ఇటు రామ్‌ చరణ్‌, అటు అల్లు అర్జున్‌కి విపరీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.  రిలీజ్‌కి ముందే ఈ రెండు సినిమాలు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుపుకుంటున్నాయి. నిజాంలో  ‘రంగస్థలం’  సినిమా రూ. 18 కోట్లకి అమ్ముడు పోగా, ‘నా పేరు సూర్య’ సినిమా రూ. 21.5 కోట్లకి సేల్ అయిన‌ట్టు తెలుస్తోంది.  బ‌న్నీ గ‌త సినిమాలు స‌రైనోడు, దువ్వాడ జ‌గ‌న్నాధమ్ నైజాంలో మంచి రెవెన్యూ సాధించ‌డంతో ఈ సినిమా భారీ రేటుకి అమ్ముడుపోయింద‌ని అంటున్నారు. కాగా రంగస్థలం మార్చి 30న,  నా పేరు సూర్య ఏప్రిల్ 26న విడుదల కానున్నాయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా