ఆలియా, మ‌హేష్ భ‌ట్‌పై కేసు న‌మోదు

3 Jul, 2020 15:09 IST|Sakshi

హిందూ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా స‌డ‌క్-2 పోస్ట‌ర్ ఉందంటూ ముజ‌ఫ‌ర్‌పూర్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ మేర‌కు చిత్ర ద‌ర్శ‌కుడు మ‌హేష్ భ‌ట్, నిర్మాత‌ ముఖేష్ భ‌ట్, న‌టి ఆలియా భ‌ట్‌పై సెక్ష‌న్ 120బి, 295ఎ కింద కేసు న‌మోదైంది. సికంద‌ర్‌పూర్ ప్రాంతానికి చెందిన ఆచార్య‌చంద్ర కిషోర్ అనే వ్య‌క్తి త‌న న్యాయ‌వాది సోను కుమార్ ద్వారా కేసు న‌మోదు చేశారు. దాదాపు రెండు ద‌శాబ్ధాల అనంత‌రం కూతురు ఆలియాతో మ‌హేష్ భ‌ట్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. స‌డ‌క్‌-2 చిత్రంలో ఆలియాతో పాటు పూజా భ‌ట్, సంజ‌య్‌ద‌త్ ప్ర‌ధాన‌పాత్ర‌లు పోషిస్తున్నారు. 1991 సంవ‌త్స‌రంలో విడుద‌లైన స‌డ‌క్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. (నెపోటిజ‌మ్‌కు కేరాఫ్‌గా స‌డ‌క్-2 )

మహేష్ భ‌ట్ బుధ‌వారం స‌డ‌క్‌-2 పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అయితే సుశాంత్ మ‌ర‌ణానికి కార‌ణ‌మ‌య్యారంటూ నెటిజ‌న్ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. బాలీవుడ్ స్టార్ కిడ్స్‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త సుశాంత్‌కు ఇవ్వ‌లేద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తున్న త‌రుణంలో ఎంతో మంది ప్ర‌ముఖులు తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. వీరిలో సుశాంత్ మాజీ ప్రేయ‌సి రియా చ‌క్ర‌వ‌ర్తితో మ‌హేష్ భ‌ట్ స‌న్నిహితంగా ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో స‌డ‌క్‌-2 పోస్ట‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి ఈయ‌న‌పై మ‌రోసారి నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. 
(ఆమె చివరి భావోద్వేగ పోస్ట్‌ అతడి గురించే)

A love story that began 29 yrs ago now journeys towards a new horizon. Sadak2 - The road to love ❤️ Here’s presenting our FIRST TEASER POSTER🌞💃🏻 First day First show, from the comfort of your homes! Watch #Sadak2 on @DisneyPlusHotstarVIP with #DisneyPlusHotstarVIPMultiplex @adityaroykapur @duttsanjay @poojab1972 @maheshfilm #MukeshBhatt @visheshfilms #SuhritaSengupta

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా