సమస్యలున్నప్పుడు లాజిక్‌ కుదరదు

23 May, 2020 21:52 IST|Sakshi

భవిష్యత్‌ పరిణామాలను ఊహించి సినిమాలు రూపొందించడంలో హాలీవుడ్‌ దర్శకుల ప్రతిభ అందరికి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కంటాజియన్‌  అనే చిత్రం చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో కరోనా పోలిన వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విధానాన్ని దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు. కంటాజియన్‌ కారణంగా ప్రపంచం ఏ విధంగా ప్రభావితమయ్యిందో  దర్శకుడు అద్భుతంగా చూపగలిగాడు. తాజాగా కంటాజియన్‌ దర్శకుడు స్టీవన్‌ సోడన్‌బర్గ్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కరోనా ఉదృతి నేపథ్యంలో ప్రజలు ఎక్కువ కాలం ఇంట్లో ఉండడానికి తవ్ర అసహనానికి లోనవతారని అభిప్రాయపడ్డారు. 

కనిపించని వైరస్‌ ప్రపంచాన్ని ఏ విధంగా వణికించిందో దర్శకుడి నైపుణ్యానన్ని సినీ విమర్శకులు సైతం ప్రశంసించారు. ఏదయినా భయంకర సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ప్రజలు లాజిక్‌ లేకుండా ప్రవర్తిస్తారని స్టీవన్‌ సోడన్‌బర్గ్ పేర్కొన్నారు.  

>
మరిన్ని వార్తలు