ఫస్ట్‌ లుక్‌ వివాదం.. కష్టాల్లో హీరోయిన్‌

13 Dec, 2018 11:29 IST|Sakshi

హీరోయిన్‌ కెరీర్‌లో 50 సినిమాలు పూర్తి చేయటమంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను సాదించిన సౌత్‌ బ్యూటీ హన్సిక. అయితే త్వరలో తన 50వ సినిమా ‘మహా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న హన్సికకు ఆ సినిమా కారణంగా వివాదాలు ఎదురవుతున్నాయి.

మహా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేసారు. అయితే ఆ లుక్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలను ధరించిన హన్సిక, సింహాసనం లాంటి కుర్చిలో కూర్చొని హుక్కా తాగుతున్నట్టుగా ఉన్న స్టిల్‌ను ఫస్ట్‌ లుక్‌గా రిలీజ్‌ చేశారు.

ఈ పోస్టర్ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ పీఎంకే పార్టీ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించటంతో సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి నెలకొంది. యు.ఆర్.జెమిల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 50వ సినిమా కావటంతో హన్సిక కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఈ వివాదం కారణంగా హన్సికకు మరింత ప్రచారం లభిస్తుందో లేక సినిమానే ఇబ్బందుల్లో పడుతుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు