కాలాలో పోరాట సన్నివేశాలపై రగడ

2 Jun, 2018 08:40 IST|Sakshi
రజనీకాంత్‌

తమిళసినిమా: కాలా చిత్రంలో 30 నిమిషాల పోరాట సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం కాలా. పా.రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 7వ తేదీన విడుదల కానుంది. ఇదిలాఉండగా రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నారు. ఆయన రాజకీయ రంగప్రవేశం అభిమానుల 25 ఏళ్ల ఆకాంక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల తూత్తుక్కుడిలో స్టెరిలైట్‌ పోరాటంలో గాయపడిన వారిని పరామర్శిచడానికి  రజనీకాంత్‌ వెళ్లిన విషయం తెలిసిందే.

వారికి ఆర్థిక సాయం అందించిన రజనీకాంత్‌ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్టెరిలైట్‌ పోరాటంలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని, అన్నిటికీ పోరాటాలు చేసుకుంటూ పోతే రాష్ట్రం శ్మశానం అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోరాటానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన రజనీ తన కాలా చిత్రంలో 30 నిమిషాల పాటు పోరాట దృశ్యాలు చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు