కరోనా పోరు: మరోసారి అక్షయ్‌ భారీ విరాళం

10 Apr, 2020 11:41 IST|Sakshi

ముంబై : దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ మరోసారి తన గొప్ప మనుసును చాటుకున్నారు. కరోనాపై పోరాటంలో ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. మున్సిపల్‌ కార్మికుల ఆరోగ్యం కోసం పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌కు(పీపీఈ) ఈ డబ్బును అందజేశారు. ఈ విషయాన్ని భారత సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్మ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ఇక కరోనా సంక్షభంలోనూ విరామం లేకుండా పనిచేస్తున్న వారికి అక్షయ్‌ ధన్యవాదాలు తెలిపారు. ‘మమ్మల్ని, మా కుటుంబాలను సురక్షితంగా ఉంచడానికి.. పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తన్న వైద్యులు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆర్మీ అధికారులు, వాలంటీర్లు.. తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ గురువారం ట్వీట్‌ చేశారు. (24 గంటల్లో 650 కేసులు, 30 మరణాలు )

దేశంలో విస్తరిస్తున్న కరోనా నుంచి దేశాన్ని రక్షించేందుకు నిధుల సేకరణ చాలా అవసరమని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మోదీ పిలుపుపై స్పందించిన అనేకమంది విపత్కర సమయంలో చేయూతనిస్తూ దేశానికి అండగా నిలుస్తున్నారు. అయితే ఇప్పటికే కిలాడీ అక్షయ్‌ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్లు విరాళం అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడు కోట్ల విరాళం అందజేసి మరోసారి సూపర్‌ స్టార్‌ అనిపించుకున్నారు.  దీంతో కరోనా మహమ్మారిపై అక్షయ్‌ చేస్తున్న సహాయానికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు దేశంలో శుక్రవారం ఉదయం నాటికి కోవిడ్ -19 పాజిటివ్ కేసులు 6,412 కు చేరుకోగా..199 మంది ప్రాణాలు కోల్పోయారు. (కరోనాపై పోరాటం: అక్షయ్‌ రూ.25 కోట్ల విరాళం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా