ఆస్తక్తి ఉన్నవారు సంప్రదించండి: దర్శకుడు

23 Mar, 2020 16:38 IST|Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు దేశంలోని  షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లు, రెస్టారెంట్లు అన్నింటినీ మూసివేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ.. కరోనాను అరికట్టేందుకు ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’కు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక ఈ మహమ్మారి ఆయా రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. దీని కారణంగా రోజువారి కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. కాగా ఈ వైరస్‌ ప్రభావంతో అతలాకుతలమైన వారిని ఆదుకునేందుకు బాలీవుడ్‌ దర్శకుడు అనుభవ్‌ సిన్హా ముందుకు వచ్చారు. (కరోనా: చప్పట్లు కాదు అవి ఇవ్వండి!)

ముంబైలోని కూలీలందరికి రేషన్‌ సరఫరా చేసుకుందుకు వాలంటీర్లు కావాలంటూ ఆయన సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ‘హాయ్‌ ఫ్రెండ్స్‌.. నేను ముంబై పరిసరాల్లోని రోజువారి కూలీలకు ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నాను. ఇందుకోసం 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ఉన్న వివిధ ప్రాంతాల వారందరికి నిత్యవసర వస్తువులు సరఫరా చేసుందుకు వాలంటీర్లు కావాలి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆసక్తి  ఉన్న వారు తనను సంప్రదించాలని కోరారు. (కరోనా ఎఫెక్ట్‌ : ప్యాకేజ్‌ ప్రకటించనున్న కేంద్రం)

వాలంటీర్లు ఇవ్వాల్సిన సమాచారం..
వారంలో రెండు సార్లు ఈ ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నం‍దున వీటి అవసరం ఎవరెవరికి, ఎంతమందికి ఉందన్న విషయంపై సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  ఎక్కడి నుంచి మీరు తీసుకు వెళ్లాలనుకుంటున్నారు, ఎవరికి ఇవి అవసరం అనే విషయాలపై సమాచారం ఇవ్వాలని.. దీని కోసం తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా సంప్రదించాలని ట్విటర్‌లో సూచించారు. కాగా తాప్సీ పొన్ను లీడ్‌రోల్‌లో ఆయన రూపొందించిన ‘థప్పడ్‌’ సినిమా ఇటీవల విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

>
మరిన్ని వార్తలు