అందరూ ఒక్కటై వెలుగులు నింపండి: చిరు, నాగ్‌

4 Apr, 2020 19:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని 130 కోట్ల మంది మరోసారి కరోనాను పారదోలేందకు తమ గొప్ప సంకల్ప బలాన్ని చాటాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆదివారం (ఏప్రిల్‌5) రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు అన్ని ఆర్పేసి దీపాలు, కొవ్వత్తులు, టార్చిటైట్లు, మొబైల్‌లలో ఫ్లాష్‌ లైట్లు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రధాని పిలుపుకు దేశ ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ప్రధాని ‘లైట్‌ దియా’ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు చిరంజీవి, నాగార్జునలు సైతం ప్రధాని మోదీ పిలుపును గౌరవించి దేశ ప్రజలు దీపాలు వెలిగించాలని కోరారు. ఈ మేరకు వీరిద్దరు ట్విటర్‌లో వీడియోలను పోస్ట్‌ చేశారు. 

‘మన గౌరవ భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు రేపు(ఆదివారం) రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు మనందరం మనకుటుంబసభ్యులతో కలసి మన ఇంటి బయటకు/ఆరుబయటకు వచ్చి కొవ్వత్తులు/దీపాలు/సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌లు/టార్చ్‌లైట్‌లు వెలిగించి సంఘీభావం తెలుపుదాం. కరోనాను తుదముట్టించడానికి భారతీయులందరూ ఒక్కటయ్యారినే సందేశాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పుదాం. రండి భారత ప్రధాని పిలుపుకు స్పందించండి కరోనాను అంతమొందించండి. అందరూ ఒక్కటై వెలుగులు నింపండి జైహింద్‌’ అంటూ చిరంజీవి ఓ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు ప్రజలందరూ దీపాలు వెలిగించి కరోనా చీకటి పారదోలాలని హీరో నాగార్జున ఆకాంక్షించారు. 

చదవండి:
ప్రధాని పిలుపుపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌
వైరస్‌ గురించి ముందే ఊహించా

మరిన్ని వార్తలు