హీరో విజయ్‌కి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు!

30 Mar, 2020 14:50 IST|Sakshi

సౌత్‌ స్టార్‌ హీరో విజయ్‌ తళపతి ఇంటిని ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. కోవిడ్‌-19 నేపథ్యంలో ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ఇళ్లను ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి కరోనా వైరస్‌ బారిన పడ్డవారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇందుకోసం గత రెండు, మూడు నెలల్లో విదేశాలకు వెళ్లిన వారి జాబితాను తీసుకుని వారందరి ఇళ్లను అధికారులు సందర్శిస్తున్నారు. (రెండు లక్షల వరకు కరోనా మృతులు)

ఇక ఈ జాబితాలో హీరో విజయ్‌ కూడా ఉండటంతో చెన్నైలోని ఆయన నీలంకరి నివాసాన్ని కూడా అధికారులు సందర్శించారు. కాగా వైద్యులు విజయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించి ఈ మహమ్మారి బారిన ఆయన కుటుంబ సభ్యులేవరు పడలేదని నిర్ధారించారు. అంతేగాక ఆరు నెలల ముందు విజయ్‌ మీనహా ఆయన కుటుంబ సభ్యులేవరు విదేశాలకు వెల్లలేదని నిర్థారించుకుని ఇంటిలో శానిటైజర్‌ స్ర్పే చేసి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్న ‘మాస్టర్‌’ సినిమా పేర్కొంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. (హైదరాబాద్‌లో కరోనా మరణం.. అంత్యక్రియలు పూర్తి)

మరిన్ని వార్తలు