దొరికిన‌ అవ‌కాశాన్ని వ‌దులుకోనంటున్న మ‌హేశ్‌

3 Apr, 2020 21:00 IST|Sakshi

క‌రోనా వైర‌స్ వ‌ల్ల సెల‌బ్రిటీలు కూడా ఇళ్ల‌కే అతుక్కుపోయిన ప‌రిస్థితి. ఎప్పుడూ షూటింగ్‌లు, పార్టీలు, ఈవెంటూ అంటూ తిరిగేవారికి కావాల్సినంత బ్రేక్ దొరికింది. దీంతో ఇంటిస‌భ్యుల‌తో ఎంజాయ్ చేస్తూ.. ఫొటో ఆల్బ‌మ్స్ తిరిగేస్తూ.. పాత జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకుంటూ.. వంటింట్లోకి దూరుతూ, కుంచె పడుతూ, ఇంటి ప‌నికి న‌డుం వంచుతూ.. ఇలా ఎన్నో ప‌నుల‌ను పూర్తి  చేసేసుకుంటున్నారు. అలా.. చేతికి చిక్కిన‌ అవ‌కాశాన్ని చేజార్చుకోకూడ‌దు అనే మాట‌ను మన సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు అక్ష‌రాలా పాటిస్తున్నాడు. లాక్‌డౌన్ వేళ‌ త‌న గారాల‌ప‌ట్టి సితార‌తో క‌లిసి  ఇంట్లో కామెడీ చిత్రం "స్టువ‌ర్ట్ లిటిల్‌" చూస్తున్నాడు. (ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు)

తండ్రీకూతుళ్లు ఎంతో ఏకాగ్ర‌త‌గా ఆ సీరియ‌ల్ చూడ‌టంలో మునిగిపోయిన‌ట్లున్న ఫొటోను మ‌హేశ్ సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ చిత్రం రెండో భాగాన్ని రేపు చూసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నాన‌ని పేర్కొన్నాడు. లాక్‌డౌన్ కాలాన్ని ఏదో ఒక‌లాగా స‌ద్వినియోగం చేసుకోండ‌ని అభిమానుల‌కు స‌ల‌హా ఇచ్చాడు. ప్రియ‌మైన వాళ్లు మ‌న‌ల్ని ఎలాగోలా ఇటువంటి ప‌నుల్లోకి లాగేస్తారని చెప్పుకొచ్చాడు. ఇక‌ క‌రోనాపై పోరాటానికి ఈ హీరో రూ.1కోటి విరాళాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. సినిమాల విష‌యానికొస్తే మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" చిత్రంలో మ‌హేశ్ న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. (బిగ్‌బాస్‌-4: హోస్ట్‌గా మహేశ్‌ బాబు!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా