చైనా కావాలనే కరోనాను ప్రపంచం మీదకు వదిలింది : నిఖిల్‌

16 Apr, 2020 12:31 IST|Sakshi

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది మానవాళి మనుగడకే సవాల్‌ విసురుతోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచంలోని లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 1.30 లక్షలు దాటింది. ఇది ఎలా పుటింది, దీనికి విరుగుడు ఏంటి అనే దానిపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోవిడ్‌-19 అసలు ఎక్కడ, ఎలా పుట్టిందనే ప్రశ్నలకు నిపుణుల నుంచి సమాధానమే కరువైంది.  గబ్బిలాల నుంచి వచ్చిందంటారు. సీ ఫుడ్స్‌ నుంచి వచ్చి వుండొచ్చంటున్నారు. ఇవేవీ కాదు, చైనా సైన్యం ఆధీనంలో నడుస్తోన్న ఓ ‘ల్యాబ్‌’ నుంచి ఇది పుట్టినట్లు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అయితే ఏకంగా కరోనాను చైనీస్‌ వైరస్‌ అంటూ సంభోదించారు. అమెరికా సైన్యం వల్లే ఈ మమహ్మారి తమ దేశంలోకి వచ్చిందని చైనా ఆరోపిస్తుంది. 
(చదవండి​ : ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల కేసులు)

ఇదిలా ఉండగా కరోనా వైరస్‌ను చైనా ఉద్దేశ పూర్వకంగానే ప్రపంచంపైకి వదిలిందని అంటున్నాడు టాలీవుడ్‌ యువహీరో నిఖిల్‌. అందుకు గల కారణాలను కూడా ట్వీటర్‌ ద్వారా వివరించారు. ‘  చైనాలోని వుహన్‌ నగరంలో కరోనావైరస్‌ మొదటిసారి బయటపడింది. దీంతో అప్రమత్తమైన చైనా జనవరిలో వుహాన్‌ నగరం నుంచి ఇతర నగరాలకు డొమెస్టిక్‌ ఫ్లైట్స్‌తో పాటు ఇతర రవాణాలను నిలిపివేసింది. కానీ వుహన్‌ నగరం నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే విమానాలకు మాత్రం అనుమతి ఇచ్చింది. చైనా ఉద్దేశ పూర్వకంగా ఈ వైరస్‌ను ప్రపంచం మీదకి వదలకపోతే.. వుహన్‌ నుంచి అంతర్జాతీయ విమానాలను ఎందుకు నడిపింది’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు