-

కరోనాపై వార్‌ : ప్రభాస్‌, ఎన్టీఆర్‌ భారీ విరాళం

26 Mar, 2020 18:59 IST|Sakshi

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. యావత్ ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి వల్ల భారతదేశంలో ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించింది.  కరోనాను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కొంతమంది టాలీవుడ్‌ హీరోలు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. 
(చదవండి : క‌రోనా: నెటిజ‌న్ల‌కు ప్ర‌కాష్‌రాజ్ సూచ‌న‌)

ఇప్పటికే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రూ. రెండు కోట్లు విరాళంగా ఇచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవి, మహేశ్‌బాబు చెరో  కోటి రూపాయలు  విరాళంగా అందజేశారు.  రామ్ చరణ్ 70 లక్షల రూపాయలు, నితిన్ 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. తాజాగా కరోనా కట్టడికి యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా తన వంతు సాయం అందించాడు.  కరోనాపై పోరాటానికి, ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా  కోటి రూపాయల విరాళం ప్రకటించారు.  ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌, తెలంగాణ రిలీఫ్‌ ఫండ్‌కి అందజేస్తున్నట్లు  ప్రభాస్‌ ప్రకటించారు. 
(చదవండి : కరోనాపై పోరాటం: చిరంజీవి, మహేశ్‌లు సైతం)

యంగ్ టైగ‌ర్ ఎన్టీర్ రూ.75 ల‌క్ష‌ల విరాళం
క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీర్ రూ.75ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.25ల‌క్ష‌లు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.50 ల‌క్ష‌ల విరాళంతో పాటు మ‌రో రూ.25 ల‌క్ష‌ల‌ను క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఉపాధి కోల్పోయిన రోజువారీ సినీ పేద క‌ళాకారుల‌కు అంద‌చేస్తున్నారు.

మరిన్ని వార్తలు