మరోసారి మన ఐక్యతను చాటుదాం : రామ్‌ చరణ్‌

4 Apr, 2020 16:57 IST|Sakshi

కరోనావైరస్‌పై పోరాటంలో భాగంగా దేశ ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ స్పందించారు. ప్రధాని మోదీ పిలుపును గౌరవించి ప్రతి ఒక్కరు రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దిపాలు వెలిగించాలని కోరారు.  ఈ మేరకు ఆయన శనివారం ఓ  ట్వీట్‌ చేశారు. ‘అందరికి నమస్కారం. లాక్ డౌన్ నిర్ణయాన్ని గౌరవించి పాటిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల గర్విస్తున్నాను. వారందరిపైనా నా ప్రేమాభిమానాలు ఉంటాయి. ఇప్పుడదే స్ఫూర్తితో  రేపు రాత్రి 9 గంటలకి తొమ్మిది నిమిషాల పాటు  మన ఇళ్లలో ఉన్న లైట్లన్ని ఆపేసి దీపాలు వెలిగిద్దాం. మన ప్రధానమంత్రి గారి మాట పాటిద్దాం. కరోనా లైని భారత్‌ను సాధిద్దాం’ అని రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశారు.  
(చదవండి : కరోనాపై పోరాటం: చిరంజీవి, మహేశ్‌లు సైతం)

కాగా, కరోనా కలకలం మొదలైనప్పటి నుంచి ప్రజలకు మెగా ఫ్యామిలీ ఎంతగానో తోడ్పాటుని అందిస్తూ వస్తుంది. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా  ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు రామ్‌ చరణ్‌ తన వంతు సాయం రూ. 70 లక్షల విరాళం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు చెప్పారు. ఇక లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్‌ చిరంజీవి  కోటి రూపాయలు విరాళంగా అందించారు. 

మరిన్ని వార్తలు