‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!

29 Mar, 2020 18:59 IST|Sakshi

కరచాలనం వద్దు నమస్కారాం చేద్దాం, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులను శుభ్రంగా కడుక్కుందాం, సామాజిక దూరం పాటిద్దాం.. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ పద్దతులు తప్పక పాటించాలని అటు ప్రభుత్వాలు ఇటు నిపుణులు పదేపదే ప్రజలను హెచ్చరిస్తున్నారు. అయితే గతంలోనే ‘మహానుభావుడు’  చిత్రంలో పై నియమాలను ప్రస్తావిస్తూ కాస్త హా​స్యం జోడించి ప్రజలకు చూపించారు డైరెక్టర్‌ మారుతి. హీరో(శర్వానంద్‌)కు ఉన్న అతి ఓసిడి(ఓవర్‌ క్లీనింగ్‌ డిజార్డర్‌)తో వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించారు. అయితే గతంలో ఈ సినిమా చూసి నవ్వుకున్నాం కానీ ఇప్పుడు అలాంటి పద్దతులు పాటించక తప్పడం లేదు. 

మెగాస్టార్‌ చిరంజీవి మాదిరి ఆలస్యంగా సోషల్‌మీడియాలో అడుగుబెట్టాడు హీరో శర్వానంద్‌. ఈ క్రమంలో ఆదివారం ట్విటర్‌ ఆకౌంట్‌ ఓపెన్‌ చేసిన శర్వా కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కార్టూన్‌ రూపంలో తెలిపాడు. ‘మన ప్రపంచం, మన దేశం, మన ప్రజల కోసం ప్రతీ ఒక్కరు ‘మహానుభావుడు’గా మారాలి, మారదాం’అంటూ శర్వా ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం శర్వా షేర్‌ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘వ్యక్తిగత పరిశుభ్రత గురించి ‘మహానుభావుడు’అప్పట్లోనే చెప్పాడు.. అప్పుడు నవ్వుకున్నాం ఇప్పుడు పాటిద్దాం’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు