‘ఐ స్టాండ్ విత్ హ్యుమాని అంటూ ప్రతిజ్ఞ

27 Mar, 2020 17:20 IST|Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌, నటుడు ఆయుష్మాన్‌ కురానా, హీరోయిన్‌ తాప్సీ పన్నులతో పాటు మరికొందరూ హీరో హీరోయిన్లు, ప్రముఖ దర్శకులు, నిర్మాతలు రోజువారి కూలీలను ఆదుకునేందుకు నడుం బిగించారు. కరోనా వైరస్‌ మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రదాని నరేంద్ర మోదీ దేశమంతట 21 రోజుల పాటు లాక్‌డౌన్‌కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈలాక్‌డౌన్‌తో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో వారిని ఆదుకునేందుకు  బాలీవుడ్‌ సెలబ్రిటీలంతా ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్’, ‘ఇండియన్ ఫిల్మ్‌ అండ్‌ టీవీ ఇండస్ట్రీ’ ద్వారా కూలీలకు 10 రోజులకు సరిపడ ఆహార సామాగ్రిని అందించేందుకు ‘ఐ స్టాండ్ విత్ హ్యుమానిటీ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తామంత మద్దతుగా నిలబడతామంటూ సెలబ్రిటీలంతా సోషల్‌ మీడియాలో ప్రతిజ్ఞ చేయడమే కాకుండా మిగతా సెలబ్రిటీలు సైతం మద్దతుగా నిలవాలని పిలుపునిస్తున్నారు. (కరోనా బారిన బ్రిటన్‌ ప్రధాని..)

ఈ క్రమంలో కరణ్‌ ‘ఈ కార్యక్రమానికి నావంతు సహయం చేస్తూ మద్దతుగా నిలబడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారికి సాయం చేయడమే కాకుండా ప్రేమ, ఆదరణ చూపించాల్సిన సమయం ఇదే’  అంటూ ట్వీట్‌ చేశాడు. అదే విధంగా తాప్సీ పన్ను స్పందిస్తూ.. రోజువారి కూలీలకు, కార్మికులకు సహాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. ‘రోజువారి కూలీల కోసం మనం చేసేది ఇది ఒక్కటే. ఎందుకంటే మనందరి కోసం పనిచేసే వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసం ఎంతైన ఉంది. ఒకవేళ కరోనా లాక్‌డౌన్‌ లేకపోతే ఈ అవసరమే వచ్చేదు కాదు అవునా..? కావునా కరోనాను ఎదుర్కోవడానికి వారికి సాయం చేద్దాం రండి’ అంటూ ట్వీట్‌లో విజ‍్క్షప్తి చేశారు. ఇక హీరోయిన్‌ దియా మీర్జా సైతం స్పందించారు. "మేమంతా కలిసి ఉన్నాము. అవును మేము డైలీ వేజ్ ఎర్నర్స్‌కు గౌరవంగా సహాయం చేస్తాం. నేను ఈ ప్రయత్నానికి సహకరిస్తున్నాను. అలాగే సోదరభావంలో మిగితా వారు కూడా ముందుకొస్తారని ఆశిస్తున్నాను’  అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. (ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్‌ కేసులు: కేసీఆర్‌)

కాస్తా శ్రద్ధ వహిద్దాం: ఆయుష్మాన్‌, రకుల్‌, కియారా ట్వీట్‌
అలాగే నటుడు ఆయుష్మాన్‌ ఖురానా కూడా ‘ఇది నిజంగా గొప్పది’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ‘నేను దీనికి మద్దతుగా నిలబడతానని, సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. యావత్‌ భారతదేశాం, భారతీయులు ఈ కరోనా మహామ్మారి ముప్పులో ఉన్నారు. మనలో ప్రతి ఒక్కరికి ఒక వైవిధ్యం కలిగించే శక్తి ఉంది. ఈ సంక్షోభ సమయంలో మనకు సాధ్యమైనంత వరకు ఒకరికోకరు మద్దతునివ్వడానికి.. కాస్తా శ్రద్ధ వహిద్దాం రండి’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చాడు. అంతేగాక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కియారా అద్వానీ కూడా స్పందించారు. ‘మహమ్మారి వల్ల ఇంట్లో మనమంతా సురక్షితంగా ఉన్నాం. అలాగే రోజు కష్టపడే వారూ కూడా సురక్షితంగా ఉండటానికి దానం చేద్దాం రండి’ అంటూ కియారా ట్వీట్‌ చేశారు. అలాగే రకుల్‌ కూడా ‘నేను ఈ గొప్ప ప్రయత్నానికి మద్దుతునిస్తున్న. మానవతా ప్రయోజనం కోసం సహకరించడం సంతోషంగా ఉంది. ఇంట్లో సురక్షితంగా ఉంటూనే.. ఆన్‌లైన్‌ ద్వారా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు. (‘బాలిక వధూ’ నటుడికి పుత్రోత్సాహం)

అంతేగాక హీరో సిద్దార్థ్‌ మల్హోత్రా ‘‘ఇలాంటి సమయాల్లోనే మనం అవసరమైన వారి కోసం ముందడుగు వేయాలి. ఈ మానవతా ప్రయోజనానికి నేను సహకరించడం సంతోషంగా ఉంది. మీరందరూ ఆన్‌లైన్‌ ద్వారా కూడా సహకరించవచ్చు’’ అని #iStandWithHumanity అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు. చిత్ర నిర్మాత నితేష్ తివారీ ‘‘ఈ కఠినమైన సమయంలో మన సహాయం అవసరమయ్యే రోజువారీ కూలీలు చాలా మంది ఉన్నారు. దయచేసి మీకు వీలైనంతగా సహాయం చేయండి. ఆన్‌లైన్‌లో సహకారం అందించే లింక్ ఇక్కడ ఉంది’’ అన్నాడు. అలాగే భూమి ఫెడ్నేకర్ సైతం "ప్రస్తుత గడ్డు కాలాన్ని కూలీలు ఎదుర్కొడానికి సహాయపడటం చాలా ముఖ్యం’’  అంటూ స్పందించాడు. (లాక్‌డౌన్‌: స‌ల్మాన్ ఏం చేస్తున్నాడో తెలుసా!)

మరిన్ని వార్తలు