మళ్లీ షూటింగ్‌లకు‌ బ్రేక్‌

24 Jun, 2020 13:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం చెలరేగింది. దీంతో మరోసారి షూటింగ్స్‌కు బ్రేక్‌ పడింది. మంగళవారం ఓ సీరియల్‌లోని ముఖ్య నటుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వెంటనే ఆ సీరియల్‌ షూటింగ్‌ను నిలిపివేసి యూనిట్‌ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటనతో మిగతా సీరియల్స్‌ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. షూటింగ్‌లు ఇలాగే కొనసాగిస్తే నటీనటులు, సిబ్బంది కరోనా బారిన పడే అవకాశం ఉందని భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో షూటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు నటీనటులు, నిర్మాతలు సమావేశం అయ్యారు. (తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం)

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలకు పైగా వాయిదా పడిన టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇటీవలే మళ్లీ మొదలయ్యాయి. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ జరుపుతున్నా.. ఓ టీవీ సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడం బుల్లితెరను వణికిస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే షూటింగ్‌ పూర్తి చేసుకున్న పలు చిత్రాలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్నాయి. అంతేకాకుండా కొన్ని చిన్న సినిమా షూటింగ్‌లు పలు జాగ్రత్తలతో ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితల నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాలు ఈ మధ్యకాలంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. (షూటింగ్‌లు స్టార్ట్‌.. యాంకర్స్‌ సందడి)   

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు