స్కార్ఫ్‌తో ఉన్నా భయపడుతూనే!: నటి

30 Apr, 2017 19:06 IST|Sakshi
స్కార్ఫ్‌తో ఉన్నా భయపడుతూనే!: నటి

ముంబై: అభిమానం హద్దులుదాటితే హీరోయిన్లు కాస్త వెనకడుకు వేస్తారు. అందరిలోకి అంత సులువుగా వచ్చి కలిసిపోవడానికి కాస్త ఇబ్బంది పడతారు. ప్రస్తుతం మారాఠీ బ్లాక్ బస్టర్ మూవీ 'సైరత్' హీరోయిన్ రింకూ రాజ్గురు పరిస్థితి అలాగే ఉంది. ఎనిమిదో తరగతి చదువుతుండగానే నటించిన ఆ మూవీ తొమ్మిదో తరగతి చదువుతుండగా గతేడాది విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న ఈ చిన్నది బయటకు రావాలంటే మాత్రం వణికిపోతోంది. ఎందుకంటే గతేడాది మూవీ విడుదలైనప్పటినుంచీ షోలాపూర్ జిల్లా అక్లుజ్ గ్రామంలో ఆమె ఇంటికి అభిమానులు ఎక్కువగా రావడంతో తల్లిదండ్రులు ఇంటినుంచి బటయకు పంపేందుకు పదే పదే ఆలోచిస్తున్నారు.

సైరత్ విడుదలై ఏడాది ముగుస్తున్న సందర్భంగా చిన్నది రింకూ మీడియాతో ముచ్చటించింది. 'సైరత్ విడుదల తర్వాత నన్ను చూసేందుకు జనాలు ఇంటి ముందు క్యూ కడుతున్నారు. బజారుకు వెళ్తే కూడా కొందరు  గుర్తించి ఫాలో అవడం భయపెడుతుంది. నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడాలని కొందరు చూస్తుంటారు. నా ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కొందరు వెంబడించడం మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. స్కార్క్ ధరించి బయటకు వెళ్లాలంటే కూడా భయంగా ఉంది. నా కళ్లను చూసి చాలామంది ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. దీంతో నా సమస్యలు మళ్లీ మొదటికి వచ్చాయనిపిస్తోంది. అసలే నాది చిన్న వయసు కావడంతో వచ్చిన వారు నాతో ఎలా ప్రవర్తిస్తారోనని, వారితో మాట్లాడుతూ కూర్చుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయోనని చాలా సందర్భాల్లో బయటకు రావడం మానేశాను' అని రింకూ చెప్పుకొచ్చింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా