రజనీకాంత్‌ను కలవాలనుంది!

6 May, 2019 09:19 IST|Sakshi

క్రికెటర్‌ బ్రావో 

టీ.నగర్‌: నటుడు రజనీకాంత్‌ను కలవాలని ఉందని క్రికెటర్‌ బ్రావో వెల్లడించారు. వెస్ట్‌ ఇండీస్‌ క్రికెటర్‌ బ్రావో ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు కోసం ఆటాడుతున్నారు. చాలాకాలంగా ఆయన చెన్నై జట్టులో ఆడుతున్నందున ఇక్కడి సంస్కృతి, ఆహార పదార్థాలు ఎంతగానో నచ్చుతున్నాయి. ఇలావుండగా నటుడు రజనీకాంత్‌ను కలవాలనుందని బ్రావో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు రజనీకాంత్‌ గురించి విన్నానని, అయితే ఆయన నటించిన చిత్రాలను చూడలేదన్నారు. త్వరలో చూస్తానని, రజనీకాంత్‌ను కలుసుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు