ఎట్టకేలకు వంద కోట్లు దాటింది

26 Dec, 2019 14:49 IST|Sakshi

ముంబై: సల్మాన్‌ఖాన్‌ తాజా చిత్రం ‘దబాంగ్‌ 3’ ఎట్టకేలకు వంద కోట్ల క్లబ్‌లో చేరింది. మొదటి 6 రోజుల్లో ఈ సినిమా రూ.107 కోట్ల నికర వసూళ్లు సాధించినట్టు ‘బాక్సాఫీస్‌ ఇండియా’ వెల్లడించింది. బుధవారం రూ.15.50 కోట్లు వసూలు చేసినట్టు తెలిపింది. అంతకుముందు రోజు(మంగళవారం) కలెక్షన్లతో పోల్చుకుంటే ఇది 65 శాతం అధికం. క్రిస్మస్‌ పండుగ నేపథ్యంలో ఆరో రోజు కలెక్షన్లు మెరుగుపడ్డాయి.

క్రిస్మస్‌ సెలవులు అయిపోవడంతో గురువారం నుంచి వసూళ్లు తగ్గుతాయిని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం విడుదల కానున్న అక్షయ్‌ కుమార్‌ తాజా సినిమా ‘గుడ్‌న్యూస్‌’ సల్మాన్‌ఖాన్‌ చిత్రానికి గట్టి పోటీ ఇవ్వనుంది. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ‘దబాంగ్‌ 3’లో మహేశ్‌ మంజ్రేకర్‌, అర్బాజ్‌ఖాన్‌, కిచ్చా సుదీప్‌, సొనాక్షి సిన్హా ముఖ్యపాత్రల్లో నటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు