ప్రియాంకను కదిలించిన వీడియో

6 May, 2016 12:22 IST|Sakshi
ప్రియాంకను కదిలించిన వీడియో


ముంబై: బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ  ప్రియాంక చోప్రాను   ఆమె అభిమాని ఒకరు ఇంప్రెస్ చేశారు.  బాలీవుడ్, హాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ లేడీగా  దూసుకుపోతున్న ఈ భామ సంతోష పడే పనిచేశాడు ఫ్యాన్.  ప్రియాంక తండ్రి కి సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ లో షేర్  చేసి ఆకట్టుకున్నాడు.   అలా  దేశ విదేశాల్లో అత్యంత విజయవంతమైన నటీమణిగా వెలిగిపోతున్నా తానెపుడూ  ' డాడీస్  లిల్ గర్ల్ ననే చెప్పుకునే  ప్రియాంకకు మరోసారి తండ్రి  తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా చేశాడు.

తన ప్రతి విజయంలో తండ్రిని తలుచుకుంటూ.. డాడీని మిస్ అవుతున్నానని ఫీలవ్వడం మనకు తెలిసిందే.  దీన్ని గమనించిన అభిమాని,   ప్రియాంక తండ్రి  డాక్టర్ అశోక్ చోప్రా  కుమార్తె తరపున ఓ  పురస్కారాన్నిఅందుకున్నప్పటి వీడియోను పోస్ట్  చేశాడు.  దీన్ని మొదటిసారి చూశా.. మీ  తండ్రి  ఒక గొప్ప వ్యక్తి అని  తెలుస్తోంది! దీన్ని మళ్లీ చూడడం   మీకు చాలా సంతోషాన్నిస్తుందని నమ్ముతున్నానంటూ  ఆ పాత వీడియో క్లిప్ ను  ట్విట్టర్ లో షేర్ చేశాడు. అంతే అది చూసి ప్రియాంక  కదిలిపోయింది.  థ్యాంక్యూ అంటూ   రీట్విట్ చేసింది.  తండ్రి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తానెపుడూ డాడీస్ లిల్ గర్ల్ నే  అంటూ కమెంట్ చేసింది. 

   
కాగా ప్రియాంక తండ్రి డాక్టర్ అశోక్ చోప్రా క్యాన్సర్  తో బాధపడుతూ 2013, జూన్ 10న  తుదిశ్వాస విచిడిన సంగతి తెలిసిందే.