లేడీస్ టైలర్గా స్టార్ వారసుడు.?

22 Jul, 2016 14:16 IST|Sakshi
లేడీస్ టైలర్గా స్టార్ వారసుడు.?

టాలీవుడ్లో స్టార్ వారసుల తెరంగేట్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో వారసులు  వెండితెర మీద సందడి చేస్తుండగా.. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో యంగ్ హీరో చేరబోతున్నాడు. డి.రామానాయుడి మనవడు, నిర్మాత సురేష్ బాబు తనయుడు, హీరో వెంకటేష్ అన్న కొడుకు, యంగ్ హీరో రానా తమ్ముడు అయిన అభిరామ్ త్వరలోనే తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుంటున్న అభిరామ్, తొలి సినిమాపై ఇంట్రస్టింగ్ వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. సీనియర్ దర్శకుడు వంశీ ముప్పయ్యేళ్ల క్రితం, రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కించిన లేడీస్ టైలర్ సినిమాకు సీక్వల్ను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాతో దగ్గుబాటి అభిరామ్ను తెరకు పరిచయం చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా రానుందన్న టాక్ వినిపిస్తోంది.