బిగ్‌బాస్‌ ఒక తప్పుడు నిర్ణయం: నటి

14 Oct, 2019 10:09 IST|Sakshi

ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా ప్రస్తుతం రియాలిటీ షో బిగ్‌బాస్‌ ఫీవర్‌ నడుస్తోంది. ఇప్పటికే తమిళ బిగ్‌బాస్‌ షో పూర్తికాగా.. తెలుగులో బిగ్‌బాస్‌ సందడి కొనసాగుతోంది. ఇక బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా తాజాగా హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13 ప్రారంభమైన సంగతి తెలిసిందే. రేషమీ దేశాయ్‌, సిద్దార్థ్‌ శుక్లా(చిన్నారి పెళ్లి కూతురు ఫేం), షెనాజ్‌ గిల్‌, పారస్‌ చాబ్రా, దేవొలీనా భట్టార్జీ(కోడలా కోడలా ఫేం- గోపిక), కోయినా మిత్రా, దల్జీత్‌ కౌర్‌, సిద్దార్థ్‌ డే, ఆర్తీ సింగ్‌, ఆసిమ్‌ రియాజ్‌, అబూ మాలిక్‌, షఫాలీ బగ్గా, మహీరా శర్మ వంటి సినీ సెలబ్రిటీలు బిగ్‌బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టారు. ఎలిమినేషన్‌ ప్రక్రియ నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో ఎలిమినేట్‌ అయిన తొలి కంటెస్టెంట్‌గా ‘ఇస్‌ ప్యార్‌ కో క్యా నామ్‌ దూ(తెలుగులో చూపులు కలిసిన శుభవేళ)’ సీరియల్‌ ఫేం దల్జీత్‌ కౌర్‌ నిలిచారు.

కాగా హౌజ్‌ను వీడిన అనంతరం దల్జీత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం తాను తీసుకున్న తప్పుడు నిర్ణయమని పేర్కొన్నారు. హౌజ్‌లో నటించడం చేతకాకపోవడం వల్లే తాను ఎలిమినేట్‌ అయ్యాయని పేర్కొన్నారు. ఈ షో కోసం మంచి ప్రాజెక్టును వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ‘ జీవితంలోని మరో దశను ప్రారంభించాలనే ఉద్దేశంతో బిగ్‌బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టాను. కానీ అక్కడి వాతావరణం నాకు నిరాశ మిగిల్చింది. నిజానికి నా కొడుకును వదిలి రెండు వారాల పాటు ఉన్నానన్న విషయం నాకే ఆశ్చర్యంగా ఉంది. వాడు గుర్తుకు వచ్చినప్పుడల్లా గుండెల్లో నొప్పి వచ్చేది. అయితే ఇంకొన్ని రోజులు కూడా హౌజ్‌లో ఉంటాననిపించింది. కానీ ఏం తప్పు చేశానో తెలీదు... ఎలిమినేట్‌ అయ్యాను. నేను చాలా ఎమెషనల్‌. భావోద్వేగాలను కంట్రోల్‌ చేసుకోలేను. నకిలీ స్నేహాలు, ప్రేమల మధ్య ఇమడలేకపోయాను అని దల్జీత్‌ చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం తన కొడుకు జేడన్‌కు సమయం కేటాయించే అవకాశం లభించిందని.. ఆ తర్వాత కెరీర్‌పై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. కాగా సహ నటుడు షాలీన్‌ బానోత్‌ను పెళ్లాడిన దల్జీత్‌.. 2015లో అతడి నుంచి విడాకులు తీసుకున్నారు. వీరికి కుమారుడు జేడన్‌ ఉన్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా