ఫైటింగ్‌ కింగ్‌గా డాన్సింగ్‌ స్టార్‌

1 Oct, 2018 11:13 IST|Sakshi
యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ చిత్రంలో ఓ దృశ్యం

సినిమా: ప్రభుదేవాను ఇప్పటి వరకూ డాన్సింగ్‌స్టార్‌గానే చూసిన ప్రేక్షకులు త్వరలో ఫైటింగ్‌కింగ్‌గా కూడా చూడబోతున్నారు. అవును ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ చిత్రం ఒకటి. వాసన్‌ విజువల్‌ వెంచర్స్‌ పతాకంపై కేఎస్‌.శ్రీనివాసన్, కేఎస్‌.శివరామన్‌ నిర్మిస్తున్న చిత్రం యంగ్‌ మంగ్‌ ఛంగ్‌. ఇందులో ప్రభుదేవా సరసన నటి లక్ష్మీమీనన్‌ నటిస్తోంది. దర్శకుడు తంగర్‌బచ్చన్, ఆర్‌జే.బాలాజి, కట్, మునీశ్‌కాంత్, మారిముత్తు, విద్య నటిస్తున్నారు. బాహుబలి చిత్ర విలన్‌ ప్రభాకర్‌ ఇందులోనూ విలన్‌గా నటిస్తున్నారు. నవ దర్శకుడు అర్జున్‌.ఎంఎస్‌ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈచిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి అయ్యిందని చెప్పారు. ఇటీవల ఇందులోని ప్రభుదేవా విలన్‌ ప్రభాకర్‌తో పోరాడే ఒక భారీ పోరు దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలిపారు. చెన్నై సమీపంలోని పొళిచ్చనూర్‌ అడవుల్లో 7 రోజులు పాటు చిత్రీకరించిన ఈ పోరాట సన్నివేశాల్లో  ప్రభుదేవా, ప్రభాకర్‌లతో పాటు వేలాది మంది సహాయ నటీనటులు పాల్గొన్నారని చెప్పారు. చిత్రంలోని హైలెట్‌ అంశాల్లో ఈ పోరాట దృశ్యం ఒకటి అని అన్నారు. ఇందులో ప్రభుదేవా కుంగ్‌ఫూ మాస్టర్‌గా నటిస్తున్నారని తెలిపారు. ఆయన నటించిన చిత్రాలన్నింటికంటే యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ చిత్రం భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఇక ప్రభాకర్‌ ఫైట్స్‌లో శిక్షణ ఇచ్చే బృందానికి నాయకుడిగా నటిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ చిత్రం ఆబాలగోపాలాన్ని అలరించేవిధంగా ఉంటుందని దర్శకుడు అర్జున్‌ తెలిపారు. ఈ చిత్రానికి ఆర్‌పీ.గురుదేవ్‌ ఛాయాగ్రహణం, అమ్రీశ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు