హీరోయిన్స్‌ ఇన్‌ యాక్షన్‌

18 Dec, 2018 02:27 IST|Sakshi
రియల్‌ దండుపాళ్యం’లో ఓ దృశ్యం

మేఘనా రాజ్, రాగిణి త్రివేది, దీప్తి, సంయుక్త వర్నాడ్‌ ముఖ్య పాత్రల్లో మహేశ్‌ తెరకెక్కించిన చిత్రం ‘రియల్‌ దండుపాళ్యం’. శ్రీ వైష్ణోదేవి మూవీస్‌ పతాకంపై సి. పుట్టు స్వామి నిర్మించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘ఏ’ సర్టిఫికెట్‌ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత పుట్టు స్వామి మాట్లాడుతూ – ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. హీరోయిన్లు మేఘన, రాగిణి, దీప్తి, సంయుక్తల యాక్షన్‌ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ నెలాఖరున సినిమా రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీధర్‌. వి. సంబ్రమ్‌.

మరిన్ని వార్తలు