సినిమాలకు గుడ్‌బై

1 Jul, 2019 05:33 IST|Sakshi
జైరా వసీమ్‌

కెరీర్‌ ఎంత వీలుంటే అంత లాంగ్‌గా ఉండాలని కోరుకుంటారు ఆర్టిస్టులు. కానీ పది సినిమాలు కూడా చేయని జైరా వసీమ్‌ సినిమాల నుంచి తప్పుకుంటున్నాను అని సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ‘దంగల్‌’ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె పాత్రలో హిందీ సినిమాలో కనిపించారు జైరా. ఆ తర్వాత ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ సినిమాలో నటించారు. ‘‘ఐదేళ్ల క్రితం నేను తీసుకున్న నిర్ణయం (యాక్టర్‌గా మారాలని) నా జీవితాన్ని మార్చేసింది. ఎంతో ప్రేమను, అభిమానాన్ని ఇచ్చింది. ఈ ఇండస్ట్రీకి నేను తగినదాన్ని అయినా ఇండస్ట్రీ నాకు తగదనిపిస్తోంది.. నా ప్రశాంతతను కోల్పోయే పని చేయదలుచుకోలేదు.. అందుకే ఇండస్ట్రీ నుంచి వైదొలగాలనుకుంటున్నాను’’ అని తెలిపారు. ఇది వరకూ జైరా వసీమ్‌ పలుమార్లు బెదిరింపులకు గురయ్యారు. దీంతో ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఇండస్ట్రీ టాక్‌.

మరిన్ని వార్తలు