దర్శకుడు కావలెను

23 Aug, 2018 01:47 IST|Sakshi
డ్యానీ బోయేల్‌

హీరో ఫిక్స్‌ అయ్యాడు. స్క్రిప్ట్‌ పనులన్నీ కంప్లీట్‌. షూటింగ్‌ షెడ్యూల్‌ వేసేశారు. రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించేశారు. ఇంకో రెండు నెలల్లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లాలి. సడన్‌గా ‘ఈ సినిమా నుంచి నేను తప్పుకుంటున్నాను’ అనేశారు దర్శకుడు. బాండ్‌ సినిమాలో ట్విస్ట్‌ లాంటిదే ఆఫ్‌ స్క్రీన్‌ ఇచ్చారు దర్శకుడు డ్యానీ బోయేల్‌. జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లో వస్తున్న 25వ సినిమా నుంచి తప్పుకున్నారాయన. ఆల్రెడీ నాలుగుసార్లు బాండ్‌గా కనిపించిన డేనియల్‌ క్రేగ్‌ ఐదోసారి బాండ్‌గా కనిపించనున్నారు.

‘‘జేమ్స్‌ బాండ్‌ 25వ సినిమా దర్శకత్వ  బాధ్యతలు నుంచి డానీ బోయేల్‌ తప్పుకుంటున్నారు. క్రియేటీవ్‌ డిఫరెన్స్‌లే అందుకు కారణం’’ అని నిర్మాతలు మైఖెల్‌ జీ విల్సన్, బార్బరా బ్రూకలీ, హీరో డేనియల్‌ క్రేగ్‌  ‘జేమ్స్‌ బాండ్‌007’ అఫీషియల్‌ ట్వీటర్‌ అకౌంట్‌ నుంచి అధికారికంగా అనౌన్స్‌ చేశారు. అక్టోబర్‌ 25 (యూకే) నవంబర్‌ 8, 2019 (యుఎస్‌) రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసిన చిత్రబృందానికి కొత్త దర్శకుడు ఎవరు వస్తారు? అనే విషయం పై క్లారిటీ లేదు.

మరిన్ని వార్తలు