'సై రా'తో రీ ఎంట్రీ

19 Nov, 2017 11:27 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సై రా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుధీప్ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాతో ఓ స్టార్ వారసుడు రీ ఎంట్రీ ఇవ్వనున్నాడట. దర్శక రత్న దాసరి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన దాసరి అరుణ్ హీరోగా విజయం సాధించలేకపోయాడు. 

తరువాత క్యారెక్టర్ నటుడిగా ఆకట్టుకునే ప్రయత్నం చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇటీవల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రకటించిన అరుణ్ కుమార్, సై రా తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడట. అంతేకాదు ఈసినిమాలో అరుణ్ ప్రతినాయక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. సై రా లాంటి సినిమాతో రీ ఎంట్రీ ఇస్తే అరుణ్ కు మంచి కమ్ బ్యాక్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు