దాసరి గుర్తుండిపోతారు

24 Sep, 2019 00:24 IST|Sakshi
డి. నాగరాజు, నవీన్, తమ్మారెడ్డి భరద్వాజ్, రేలంగి నరసింహారావు, సాయిప్రసాద్‌

రాక్‌స్టార్‌ ఈవెంట్స్, కింగ్‌ మీడియా ఈవెంట్స్‌ సంయుక్తంగా దర్శకరత్న దాసరి నారాయణరావు పేరిట ప్రతి యేటా అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఎన్‌ఆర్‌ఐలు జై శంకర్, కళ్యాణ్, సాయిప్రసాద్‌ యండమూరి, నాగ రాజు, నవీన్‌తో పాటు వారి స్నేహితులు కలిసి అక్టోబర్‌ 26న శిల్పకళా వేదికలో ‘దాసరి అవార్డ్స్‌’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు రేలంగి నరసింహారావు విడుదల చేశారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘మా గురువు దాసరి నారాయణరావుగారు మరణించినా కూడా ఇప్పటికీ ఆయనకి అభిమానులు ఉండటం నిజంగా గర్వించదగ్గ విషయం.

ఆయన పేరిట అవార్డ్స్‌ను ప్రదానం చేయడం ఇంకా ఆనందదాయకం. అక్టోబర్‌ 25న దాసరి పద్మగారి జయంతి కాబట్టి ఈ మహోన్నత కార్యక్రమాన్ని అక్టోబర్‌ 26న కాకుండా 25న జరిపితే బాగుంటుందనేది నా ఉద్దేశం. ప్రతి నెలా కొంతమంది పేద ఆర్టిస్టులకు చెక్కులు ఇవ్వడం, ప్రతియేటా మే 4న తన పుట్టినరోజును పురస్కరించుకొని పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమంటే దాసరిగారికి చాలా ఇష్టం. దీనిని∙ఆయన ఓ బాధ్యతగా భావించేవారు. ఆ కార్యక్రమాలను కూడా కళ్యాణ్, నాగరాజు, జై శంకర్‌ తదితరులు ప్రతి యేటా నిర్వర్తిస్తామని మాటిచ్చారు’’ అన్నారు. ఈ సమావేశంలో ఆర్గనైజర్లు (ఎన్‌ఆర్‌ఐ) జై శంకర్, కళ్యాణ్, సాయి ప్రసాద్‌ యండమూరి, నాగరాజు, నవీన్‌ పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా