దాసరి ఇంట్లో ఆస్తి తగదా: మీడియా ముందుకు అరుణ్‌

27 Jun, 2020 10:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ద‌ర్శ‌క‌ర‌త్న డాక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు కుమారులు అరుణ్ కుమార్‌, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో దాసరి అరుణ్‌పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ్‌ అర్ధరాత్రి ఇంట్లోకి  వచ్చి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని.. అడ్డుకున్న తమపై దాడికి చేశాడని ప్రభు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై అన్న ప్రభు చేసిన ఆరోపణపై అరుణ్‌ స్పందించారు. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెబుతానని పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు దాసరి అరుణ్‌ మీడియా ముందుకు రానున్నారు.
(చదవండి : దాసరి ఇంట పంచాయితీ: పోలీసులకు ఫిర్యాదు)

జూబ్లీహిల్స్‌లోని ఇల్లు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇల్లు నాదంటే నాదంటూ.. అరుణ్‌-ప్రభు త‌గువులాడుకుంటున్నారు. ఆ ఇల్లు తన కూతురి పేరు మీద దాసరి  వీలునామా రాశారని ప్రభు చెబుతున్నారు. సినీ పెద్దలు కలగజేసుకొని తనకు న్యాయం చేయాలని దాసరి పెద్ద కుమారుడు ప్రభు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు