సినిమాలపై దావూద్‌ ప్రభావం

30 Jun, 2020 15:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 1993లో జరిగిన ముంబై బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడైన దావూద్‌ ఇబ్రహీం కరోనా వైరస్‌ సోకి మరణించినట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. పాకిస్థాన్‌లోని కరాచిలో తలదాచుకుంటున్న దావూద్‌ మరణించలేదని ఆ తర్వాత తెల్సింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌గా అనేక హత్యలు, దోపిడీలు చేసిన దావూద్‌కు 1993 పేలుళ్లతో టెర్రరిస్టుగా ముద్ర పడింది. ఆయనది చీకటి ప్రపంచమైనా బాలివుడ్‌ సినిమాల ద్వారా ఆయన వెలుగులోకి వచ్చారు. హీరో స్థాయి గుర్తింపు పొందారు. (చదవండి : కదలని చిత్రం - నడవని బండి)

దావూద్‌ ఇబ్రహీం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా  తీసుకునే ‘బ్లాక్‌ ఫ్రైడే, కంపెనీ, షూటవుట్‌ ఎల్‌ వడాలా, వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబై, డీ డే, హసీనా పార్కర్‌ సినిమాలు రాగా, ‘ఏక్తీ బేగమ్‌’ వెబ్‌ సిరీస్‌గా వచ్చింది. దాదావూద్‌ ఇబ్రహీం తరహా విలన్‌ను చంపడం కోసం ఓ మహిళ కుట్ర పన్నడమే ఆ సిరీస్‌ ఇతివృత్తం. 

1993లో ముంబైలో జరిగిన వరుస పేలుళ్లకు సంబంధించి అనురాగ్‌ కాష్యప్‌ తీసిన ‘బ్లాక్‌ ఫ్రైడే’ సినిమాలో దావూడ్‌ పాత్రను విజయ్‌ మౌర్య పోషించారు. 2002లో రామ్‌ గోపాల్‌ వర్మ తీసిన ‘కంపెనీ’ సినిమాలో ఒకప్పటి దావూద్‌ అనుంగు శిష్యుడు చోటా రాజన్, దావూద్‌కు మధ్య తలెత్తిన గొడవలను ప్రధానంగా తీసుకున్నారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద హిట్‌ కొట్టి సొమ్ము చేసుకున్నాయి. (చదవండి : అల్లరి నరేష్ ఫ్యాన్స్‌కు ఓ సర్‌ప్రైజ్)

మరిన్ని వార్తలు