దావూద్ ఇబ్రహీం జీవితకథనంతో..

3 Jul, 2014 00:25 IST|Sakshi
దావూద్ ఇబ్రహీం జీవితకథనంతో..

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘దావూద్’ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. బి. రాజేష్‌పుత్ర దర్శకత్వంలో డిక్కి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్.కె. షరీఫ్, వీరభద్రం, తంగల్‌రెడ్డి, ఆర్వీ సుబ్బారావు, జేఎల్ శ్రీనివాస్ ముఖ్య తారలు. ఈ చిత్రవిశేషాలను దర్శకుడు చెబుతూ -‘‘దావూద్ జీవితాన్ని కొత్త కోణంలో బయటపెట్టే చిత్రం ఇది. ఆయన పుట్టినప్పట్నుంచీ ఇప్పటివరకూ అన్ని విషయాలను ఈ చిత్రంలో పొందుపరుస్తున్నాం. దావూద్ గురించి ఎవరికైనా ఆసక్తికరమైన సమాచారం తెలిస్తే, మాకు ఇవ్వొచ్చు. రత్నగిరి, ముంబయ్, నేపాల్, దుబాయ్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సునిల్ పుత్ర, కెమెరా: మహ్మద్ రఫి, ఎడిటింగ్: నాగేంద్ర.

>