దక్కన్ హీరోతో... గోల్‌మాల్!

12 Apr, 2016 23:22 IST|Sakshi
దక్కన్ హీరోతో... గోల్‌మాల్!

దక్కన్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న కథానాయకుడు గుల్లు దాదా (అద్నాన్ సాజిద్ ఖాన్) తొలిసారి ‘గోల్‌మాల్ గుల్లు’ అనే ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. డిక్కి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ ఫిలిం పతాకంపై ‘దావూద్’ చిత్రం ఫేం బె జ్జం రాజేష్ పుత్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఎమ్మెస్ నారాయణ ప్రధాన పాత్రలో నేను తెరకెక్కించిన ‘నవాబ్ బాషా’ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేస్తాం. ఇప్పుడు ఈ ‘గోల్‌మాల్ గుల్లు’ చిత్రంతో గుల్లు దాదా తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకుంటారు.

ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. రఘుబాబు, పెంటాలి సేన్, ప్రియాంక, అక్బర్ షరీఫ్, హసఫ్ సమీర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: చక్రి, సంగీతం: కున్ని.