లేడీ డాన్‌గా దీపిక

4 Nov, 2017 13:48 IST|Sakshi

బాలీవుడ్‌ లో వరుస విజయాలతో స్టార్‌ హీరోలకు పోటి ఇస్తున్న దీపిక పదుకొణె మరో ఆసక్తికరమైన సినిమాలో నటించనుంది. ముంబైని గడగడలాండించిన లేడీ డాన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో దీపిక నటించనుంది. 80లలో ముంబయికి చెందిన మాఫియా క్వీన్‌ సప్నా దీదీ జీవితాధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది.  ఈ సినిమాలో సప్నా దీదీగా దీపిక నటించనుంది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

పీకు సినిమాతో సక్సెస్‌ఫుల్‌ పెయిర్‌ అనిపించుకున్న దీపిక పదుకొణె, ఇర్ఫాన్‌ ఖాన్‌ లు ఈ బయోపిక్‌ కోసం మరోసారి జోడికడుతున్నారు. ప్రస్తుతం పద్మావతి ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న దీపిక, ఆ పనులు పూర్తయ్యాక బయోపిక్‌ షూటింగ్‌లో పాల్గొననుంది. ఈ సినిమాకు విశాల్‌ టీంలో చాలా కాలంగా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న హనీ దర్శకత్వం వహించనున్నాడు.

మరిన్ని వార్తలు