హాలీవుడ్‌లో లుంగీ డ్యాన్స్‌

3 Jun, 2018 04:20 IST|Sakshi

‘ఆల్‌ ది రజనీ ఫ్యాన్స్‌...’ అంటూ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ మూవీలో షారుక్‌ ఖాన్‌ లుంగీ డ్యాన్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ లుంగీ డ్యాన్స్‌ హాలీవుడ్‌ సినిమాలోనూ రిపీట్‌ కానుంది. విన్‌ డీజిల్‌ ‘ట్రిపులెక్స్‌’ సినిమాలో లుంగీ డ్యాన్స్‌ పాటతో ఎండ్‌ చేయాలనుకుంటున్నారట దర్శకుడు డిజే కరుసో. ‘ట్రిపులెక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ సినిమాలో దీపికా పదుకోన్‌ యాక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన నాలుగో భాగంలో దీపికా పదుకోన్‌ భాగం కారట. అందుకే ఇండియన్‌ ఫ్యాన్స్‌ నిరాశ పడకుండా దర్శకుడు లుంగీ డ్యాన్స్‌ ప్లాన్‌ రెడీ చేశాడు. ‘‘ట్రిపులెక్స్‌ నాలుగో పార్ట్‌ను లుంగీ డ్యాన్స్‌తో ఎండ్‌ చేయాలనుకుంటున్నా. ఆ పాటను దీపికా లీడ్‌ చేస్తే ఎలా ఉంటుంది? కొత్తగా ఉంటుంది కదూ’’ అని పేర్కొన్నారు దర్శకుడు. చివర్లో దీపికా లుంగీ డ్యాన్స్‌తో అలరిస్తారన్న మాట.

మరిన్ని వార్తలు