ఎన్నోసార్లు తిరస్కరించారు!

11 May, 2015 01:58 IST|Sakshi
ఎన్నోసార్లు తిరస్కరించారు!

‘‘నేను సినిమా పరిశ్రమకొచ్చిన ఈ ఎనిమిదేళ్లల్లో ఎన్నో జయాపజయాలు చవిచూశాను. కొన్నిసార్లు ‘ఈ సినిమాకి దీపికా పనికి రాదు’ అని తిరస్కరణకు కూడా గురయ్యాను. ఆ గాయం మానడానికి టైమ్ పట్టేది. అది మానేలోపు పుండు మీద కారం చల్లినట్లు ‘దీపికా కెరీర్ అంతే సంగతులు’ అనే మాటలు వినిపించేవి. స్వతహాగా క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని కాబట్టి, గెలుపు ఓటములను తేలికగా తీసుకోవడం అలవాటయ్యింది.
 
 మా నాన్న ప్రకాశ్ పదుకొనె (బ్యాడ్‌మింటన్ ప్లేయరు) జీవితమే నాకా మనస్తత్వాన్ని అలవాటు చేసింది. అందుకే, ఆటుపోట్లను తట్టుకోగలిగాను. ఇవాళ నన్ను అందరూ ‘స్టార్ హీరోయిన్’ అంటున్నారు. నీకు తిరుగు లేదంటున్నారు. డేట్స్ ఇస్తే చాలు.. సినిమా చేస్తామంటున్నారు. ఇదంతా సక్సెస్ మహిమే. ఈ స్టార్ డమ్‌ని నెత్తికెక్కించుకోకుండా ఎప్పటిలానే ఉండాలని అనుకు న్నాను. ఎందుకంటే, ఇవాళ ఎత్తేసినవాళ్లే రేపు పడేస్తారని నాకు తెలుసు. నా ఎనిమిదేళ్ల కెరీర్ నేర్పించిన విషయం ఒకటే. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడకూడదు. మనకు మనమే సహాయం చేసుకోవాలి’’.
 - దీపికా పదుకొనె
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి