దీపికకు రణ్‌వీర్‌ భావోద్వేగ లేఖ!

10 Jan, 2020 12:11 IST|Sakshi

యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛపాక్‌’. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపిక పదుకొనే లీడ్‌ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. శుక్రవారం(జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో ప్రశంసలను అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రిమీయర్‌ షోకి వెళ్లిన దీపికా భర్త, బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్ భావోద్వేగానికి లోనవుతూ దీపిక, చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు. దర్శకురాలు మేఘనా గుల్జార్‌ను అభినందిస్తూ.. ‘ మేఘనా.. మీ చిత్రం ప్రేక్షకుల్లో.. జీవితంపై ఆశను, ధైర్యాన్ని నింపుతుంది. సినిమా ద్వారా మంచి, చెడుల మధ్య రంగులు మారే మనిషి మానవత్వాన్ని చూపించారు. యాసిడ్‌ హింస వల్ల బాధితులు ఎదుర్కొనే కఠిన పరిస్థితులను నిశితంగా చూపించారు. నేను ఖచ్ఛితంగా చెప్పగలను.. రాజి, తల్వార్‌ల తరువాత ఛపాక్‌ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఓ గొప్ప దర్శకురాలిగా నిలబెడుతుంది’ అంటూ రాసుకొచ్చాడు.

అదేవిధంగా దీపికా పదుకొనే గురించి చెబుతూ.. ‘మై బేబీ.. నువ్వు ఈ సినిమా కోసం నిరంతరం కృషి చేశావని చెప్పడానికి నేనే సాక్ష్యం. దీనిని రూపొందించడానికి నువ్వు ఇంజన్‌లా పనిచేశావు.. ‘ఛపాక్‌’కు నువ్వు ఆత్మ. నీ సినిమా కెరీర్‌లోనే ఇది అత్యంత ప్రాముఖ్యత ఉన్న చిత్రం. దీని కోసం నువ్వు, నీ టీమ్‌ భయాలను, సమస్యలను అధిగమించారు. అలాగే పరిస్థితులతో పోరాడి వాటిని అధిగమించి చివరకు నువ్వు, నీ చిత్ర బృందం కలిసి ప్రస్తుతం పరిశ్రమలో ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించారు’  అంటూ రణ్‌వీర్‌, దీపిక, చిత్ర బృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు. అలాగే ‘ఛపాక్‌’లో దీపికా పాత్రపై స్పందిస్తూ.. ‘నేను ఊహించిన దాని కంటే అద్భుతంగా నటించి నన్ను కదిలించావు. నీ నటన నన్ను ఆశ్చర్యపరించింది. బలహీనతకు బలాన్ని జోడించి మాల్తి పాత్రకు గౌరవాన్నితెచ్చావు. నేను నీ కంటే గొప్పవాడిని అని ఎన్నడూ గర్వించలేదు... ఐ లవ్‌ యూ బేబీ’  అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. కాగా రణ్‌వీర్‌ తన తల్లిదండ్రులు, దీపిక తల్లిదండ్రులతో కలిసి ఛపాక్‌ ప్రీమియర్‌ షోకు వెళ్లాడు. ఇక ఛపాక్‌కు దీపిక నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 

Meghna, your film gives the audience hope and courage. It shows you the best and worst of humanity in a kaleidoscopic cinematic spectrum. It elucidates a subject that we’ve only ever heard of but never really fully understood. It offers a definitive and insightful deep-dive into the horrific gamut of acid violence. The story shakes you to your core and then lifts you heroically until your emotions soar. Talvar, Raazi and now Chhapaak..may I say “Bravo!” And “Encore!” ❤️ My baby. I’ve witnessed you toil relentlessly to create this special piece of work. You’ve been an engine behind the project, and are the soul of the film. This is the most important instalment in your body of work. You laboured with such honesty in intent and action. You dug deep and fought through your challenges, faced your fears, overcame your struggles and today you and your team stand triumphant as the creators of one of the films of our times. Your performance is way more than everything I thought it could and would be. It’s moved me, stirred me and stayed with me. You blended strength with vulnerability and lent dignity to an immensely complex portrayal in such a fine manner that I’m simply awestruck at your craft. Its staggering and astonishing what you’ve achieved with Malti. A glowing gem in your repertoire. I love you baby. I’ve never been more proud of you. @deepikapadukone #chhapaak

A post shared by Ranveer Singh (@ranveersingh) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా