ఛపాక్‌ : కన్నీళ్లు పెట్టుకున్న దీపిక

10 Dec, 2019 19:46 IST|Sakshi
స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న దీపికా పదుకునే

సినిమాల్లోని కొన్ని పాత్రలు ప్రేక్షకులకే కాదు, నటులకు కూడా ఎంతగానో నచ్చుతాయి. అలా వారు నటించిన పాత్ర లేదా సినిమా గురించి మాట్లాడే సందర్భంలో వారు ఉద్వేగానికి లోనవుతుంటారు. తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే కూడా ఎమోషనల్‌ అయింది. ఆమె తాజాగా నటించిన చిత్రం ‘ఛపాక్‌’. ఈ సినిమా ట్రైలర్‌ను ముంబైలో మంగళవారం రిలీజ్‌​ చేశారు. అయితే, యాసిడ్‌ దాడి బాధితురాలు లక్షీ​ అగర్వాల్‌ పాత్రలో నటించిన దీపిక చిత్ర ట్రైలర్‌ విడుదల సమయంలో మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. చిత్ర విశేషాలను చెప్తున్న క్రమంలో దీపిక కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో అక్కడే ఉన్న దర్శకురాలు మేఘనా గుల్జార్‌ ఆమెను ఓదార్చారు.


ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కాగా 2005లో యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మి అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా ‘ఛపాక్‌’ చిత్రం తెరకెక్కుతోంది. లక్ష్మీ పాత్రలో నటించిన దీపిక.. ఇది తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన చిత్రమంటూ పేర్కొంది. ఇక లక్ష్మీ భర్త అమల్‌ దీక్షిత్‌ పాత్రలో ప్రముఖ నటుడు విక్రాంత్‌ మాస్సే నటించారు. తాజాగా విడుదలైన ఛపాక్‌ ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. యాసిడ్‌ బాధితురాలి పాత్రలో దీపిక జీవించిందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఛపాక్‌ సినిమా ద్వారా చిత్రబృందం సమాజానికి ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. (చదవండి: పాక్‌ ట్రైలర్‌ విడుదల)

#DeepikaPadukone gets emotional during #chhapaak trailer launch in #mumbai today #video #paparazzi #instadaily #manavmanglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు

ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: త‌మ‌న్

కరోనా: క‌నికాకు బిగ్‌ రిలీఫ్‌

అందరూ ఒక్కటై వెలుగులు నింపండి: చిరు, నాగ్‌

కరోనా క్రైసిస్‌: శివాని, శివాత్మిక ఉదారత

సినిమా

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు

ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: త‌మ‌న్

కరోనా: క‌నికాకు బిగ్‌ రిలీఫ్‌

అందరూ ఒక్కటై వెలుగులు నింపండి: చిరు, నాగ్‌

కరోనా క్రైసిస్‌: శివాని, శివాత్మిక ఉదారత

ప్రధాని పిలుపుపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌